వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైనట్లు స్పష్టంగా కనిపిస్తోందని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు విమర్శించారు. ముఖ్యమంత్రి ఆకాశం నుంచే బాధితులకు 2 వేల రూపాయల సాయం చేశారని ఎద్దేవా చేశారు. తాగునీరు, ఆహారం లేక ముంపు ప్రాంతాల్లోని వృద్ధులు, మహిళలు, చిన్నారులు అలమటిస్తున్నారన్నారు.
పాలకుల దృష్టంతా కక్షసాధింపులు, వేధింపులు, ఫోన్ ట్యాపింగ్లపైనే ఉందని విమర్శించారు. గత ఏడాది వరద బాధితులకు వైకాపా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నేటికీ నెరవేరలేదని నిమ్మల రామానాయుడు ఆగ్రహించారు. ప్రభుత్వం తాజా మళ్లీ హామీలు ఇస్తోందని అన్నారు. వరదలు, విపత్తులొచ్చినప్పుడు సీఎం జగన్ హామీలతో సరిపెడుతున్నారని ఆక్షేపించారు.
ఇదీ చదవండి:
కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనానికి ఉప కమిటీలు నియమిస్తూ ఆదేశాలు