ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికలకు ముందే వైకాపా ఓటమిని అంగీకరించి దిగజారుడు రాజకీయలకు పాల్పడుతోందని సీఎం ధ్వజమెత్తారు. 20 ఏళ్ల నుంచి పార్టీ సమాచారం కంప్యూటరీకరించగా ... దానిని తెలంగాణ ప్రభుత్వం సాయంతో దొంగలించే నీచానికి ఒడిగట్టారని మండిపడ్డారు. సాంకేతికతను తాము ప్రోత్సహిస్తే...సైబర్ క్రైంలో వాళ్లు చొరవచూపుతున్నారని చురకలు వేశారు. న్యాయస్థానంతో చీవాట్లు... వాళ్లకుచెంపపెట్టని దుయ్యబట్టారు. ఈ దుర్మార్గాలకు మోదీ, కేసీఆర్ సహకరిస్తున్నారని ఆక్షేపించారు. 8 లక్షల తెదేపా ఓట్లు తొలగించేందుకు కుట్ర పన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోగస్ ఓట్లు పేర్ల తొలగింపునకు పాల్పడిన వారందరిపైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. గట్టిగా గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు తెలిపారు.
ఇదీ చదవండి