ETV Bharat / state

మీ ఇంట్లో కుక్క ఉందా?... తస్మాత్ జాగ్రత్త!

పెంపుడు జంతువులు ఎంత మురపెంగా ఉంటాయో వాటితో అంతే ప్రమాదం పొంచి ఉంటుంది. సరైన జాగ్రత్తలు, పరిశుభ్రత పాటించకపోతే... అల్లారుముద్దుగా పెంచుకుంటున్న వాటి వల్లే అనారోగ్యానికి గురికావాల్సి వస్తుంది. వీటిపై అవగాహన కల్పించడానికే  ప్రతి యేటా జూనోసిస్ డే నిర్వహిస్తున్నారు.

కుక్క
author img

By

Published : Jul 6, 2019, 2:25 PM IST

జూనోసిస్ డే అంటే.... కుక్కలకోసం ప్రత్యేకించిన రోజు. లూయీస్ పాశ్చర్ అనే శాస్త్రవేత్త 1985లో యాంటీ రేబిస్ వ్యాక్సిన కనిపెట్టిన రోజునే జూనోసిస్ డే అంటూ ఏటా జులై 6న నిర్వహిస్తున్నారు. కుక్క ఎవరినైనా కరిస్తే వారికి రేబిస్ అనే వ్యాధి సోకుతుంది. కుక్కలకు టీకాలు వేయడం వల్ల... వాటి నుంచి రేబిస్ వ్యాధి ఇతర జీవాలకు, జనానికి సోకకుండా ఉంటుంది. అందుకే ఏటా జూనోసిస్ డే రోజున పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో కుక్కలకు ఉచిత రేబిస్ టీకాలు వేస్తుంటారు.

కుక్కలకు టీకాలు వేయించండి.. వ్యాధులను దూరం చేయండి

జంతువుల ద్వారా 200 నుంచి 250 రకాల వరకు వ్యాధులు మనుషులకు సంక్రమిస్తాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. వీటిలో ప్రాణాంతకమైన రేబిస్ కుక్కల ద్వారా మనుషులకు, పశువులకు సంక్రమిస్తుంది. ఆ వ్యాధి సోకిన పశువు, మనిషి మెదడులో వైరస్ స్థిర నివాసం ఏర్పరుచుకుని, పిచ్చి లక్షణాలు కలగచేస్తాయి. అందుకే కుక్కలతో తస్మాత్ జాగ్రత్త అంటూ ఉంటారు నిపుణులు. జీవసంబంధ వ్యాధులు మన పెంపుడు జంతువులకు సోకకుండా ముందస్తుగా టీకాలు వేయించాలంటున్నారు. జూనోసిస్ డే సందర్భంగా విజయవాడతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పశువుల ఆసుపత్రిలో... కుక్కలకు ఉచిత రేబిస్ టీకాలు వేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జంతుప్రేమికులు ఉదయం నుంచే ఆసుపత్రుల వద్ద బారులు తీరారు. వివిధ జాతులకు చెందిన కుక్కలను తీసుకొచ్చి టీకాలు వేయిస్తున్నారు.

Intro:ap_knl_12_05_ramjan_av_c1
రంజాన్ పండుగను కర్నూల్లో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. నగరంలోని పాత, కొత్త, ఈద్గా ల వద్ద ముస్లిమ్స్ పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాత ఈద్గాలోకర్నూల్ mla హఫేజ్ ఖాన్, పాణ్యం mla కాటసాని రాంభూపాల్ రెడ్డి, జిల్లా sp డాక్టర్, ఫక్కిరప్పా పాల్గొన్నారు. రంజాన్ సందర్బంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.

Body:ap_knl_12_05_ramjan_av_c1

Conclusion:ap_knl_12_05_ramjan_av_c1
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.