ఆరు నెలల గర్భంతో ఉన్న కానిస్టేబుల్ కరోనా మహమ్మారితో పోరాడి విగతజీవిగా మారారు. కృష్ణా జిల్లా కోడూరు పోలీసు స్టేషన్ పరిధిలోని ఉల్లిపాలెం గ్రామానికి చెందిన బుస్సాల కోటేశ్వరరావు, బసవేశ్వరి దంపతులకు కవిత రెండో సంతానం. నాగాయలంకలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోన్న ఈమెకు శ్రీరాంపురం గ్రామానికి చెందిన చిప్పల గోపాలకృష్ణతో గతేడాది వివాహమైంది. కొద్ది రోజుల క్రితం తల్లికి, సోదరికీ పాజిటివ్ వచ్చింది.
కొవిడ్‌తో ఆస్పత్రిలో చేరిక..
ఈ క్రమంలో ఈమెకూ వైరస్ సోకగా కుటుంబ సభ్యులు విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం బాధితురాలి తల్లి, సోదరి కూడా వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆమె మృతదేహాన్ని కోడూరు ఎస్‌ఐ పి.రమేష్ ఆధ్వర్యంలో తండ్రి కోటేశ్వరరావుతో ఖననం చేయించారు. ఆమె మరణ వార్త స్థానిక పోలీసుల్లో విషాదాన్ని నింపింది.
ఇవీ చూడండి : 'మూడో దశ : 85 శాతం చిన్నారులపై కరోనా ప్రభావం'