విజయవాడలో మహిళ దారుణ హత్య - భవానీపురంలో మహిళ హత్య
విజయవాడ భవానీపురంలో దారుణం జరిగింది. దుండగులు ఓ మహిళ కళ్లల్లో కారం కొట్టి దారుణంగా హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలను దోచుకెళ్లారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భవానీపురంలో మహిళ హత్య కలకలం..
కృష్ణా జిల్లా విజయవాడ భవానీపురంలో దారుణం జరిగింది. ఓ మహిళ కళ్లల్లో కారం కొట్టిన దుండగులు గొంతు కోసి ఒంటిపై ఉన్న ఆభరణాలను దోచుకెళ్లారు. మృతురాలు స్థానిక పాండు హోటల్ సమీపంలో ఉండే యేదుపాటి పద్మావతిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న భవానీపురం పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. క్లూస్ టీం బృందాలు ఆధారాలు సేకరించాయి. సీసీ టీవీ ఫుటేజ్‌ని పోలీసులు పరిశీలిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: