Court Verdict On Youtuber Fun Bucket Bhargav Rape Case : మైనర్ బాలికపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేసిన కేసులో విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 4 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని బాధితురాలికి పరిహారంగా ఇవ్వాలని తీర్పునిచ్చింది. 2021 లో నిందితుడు చిప్పాడ భార్గవ్ అలియాస్ ఫన్ బకెట్ భార్గవ్ మైనర్ బాలికను టిక్ టాక్ వీడియోల చిత్రీకరణ నెపంతో తన నివాసానికి తీసుకువెళ్లి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
విషయం బయటకు చెబితే వీడియోలను సామాజిక మాధ్యమాలలో బయటపెడతానని బెదిరించాడు. కొన్ని రోజులు తర్వాత బాధితురాలికి కడుపు నొప్పి రావడంతో తల్లి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లింది. బాలికను పరీక్షించిన వైద్యులు 4 నెలల గర్భవతిగా నిర్ధరించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు జడ్జి ఆనంది ఈ కేసు విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించారు. నిందితుడు ఫన్ బకెట్ భార్గవ్‌కు కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు నిచ్చారు.
భార్యపై 72 మంది అత్యాచారం- మాజీ భర్తకు 20 ఏళ్ల జైలుశిక్ష
ప్రాణాలతో ఉందో? లేదో? తెలియకుండానే అత్యాచారం - ఆపై కాల్వలో పడేసిన యువకులు