కృష్ణా జిల్లా మొవ్వ మండలం చిన్నముత్తేవి గ్రామంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పామర్రు మండలం చాట్లవాణిపురానికి చెందిన రెబెక్కాకు.. 20 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మగ పిల్లలు.
వ్యసనాలకు బానిసైన భర్తను ప్రశ్నించినందుకే భార్యను హతమార్చాడని బంధువుల ఆరోపిస్తున్నారు. కూచిపూడి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, వంగవీటి వర్గీయుల మధ్య మరోసారి ఘర్షణ