కృష్ణా జిల్లా మచిలీపట్నం మాచవరం రెండో డివిజన్లో ప్రసాద్, నాగమణి దంపతులు నివాసముంటున్నారు. కొద్దిరోజుల క్రితం ప్రసాద్ ఆరోగ్యం క్షీణించడంతో... స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రసాద్ మృతి చెందాడు. ఈ ఘటన గురించి మృతుని భార్య నాగమణి... ప్రసాద్ తండ్రికి సమాచారం అందించారు. అంత్యక్రియలకు రావాలని కోరారు. దానికి ఆయన నిరాకరించడంతో చేసేదేమీ లేక మృతుని భార్య నాగమణి అంతిమసంస్కారాలు పూర్తి చేసింది.
ఇదీచదవండి.