అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను అన్నారు. వైకాపా రెండేళ్ల పాలనపై కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హమీల్లో 95 శాతం పూర్తి చేశారని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. దళారులు, మధ్యవర్తులు లేకుండా లబ్ధిదారులకు ఇంటి గడప వద్దకే సంక్షేమం చేరిందన్నారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించారని తెలిపారు. 31 లక్షల మంది పేదలకు ఇళ్లపట్టాలు ఇచ్చిన ఘనత జగన్‌కే దక్కుతుందని అన్నారు.
అమ్మఒడి పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో నూతన ఒరవడి తెచ్చారన్నారు. రాష్ట్రంలో నూతనంగా 16 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని తెలిపారు.
ఇదీ చదవండి: నేడు జిల్లా వ్యాప్తంగా.. కొవాగ్జిన్ రెండో మోతాదు టీకా పంపిణీ