కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లులో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఇక్కడ 30 కోట్ల రూపాయలతో 2 పైలట్ ప్రాజెక్టులు నిర్మించారు. వీటి ద్వారా 70 గ్రామాలకు కృష్ణాజలాలు అందించాల్సి ఉంది. ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నందున.. నదీ ప్రవాహం దారి మళ్లి తాగునీరు జిల్లా వైపు రావడం లేదు. దీనికి అనుసంధానంగా ఏర్పాటు చేసిన సప్లై ఛానల్లో కొందరు బట్టలు ఉతుకుతున్నారు... పశువులనూ కడుగుతున్నారు. ఫలితంగా ఆ నీరు తాగే పరిస్థితి లేదు.
నీటిని కొనుక్కుంటున్నారు
పైలట్ ప్రాజెక్టు కింద నీరు రావడం లేదు. సప్లై ఛానల్లో నీరున్నా తాగడానికి పనికి రావడం లేదు. చేసేదేమీ లేక దాహం తీర్చుకునేందుకు ప్రజలు మంచినీటిని కొనుక్కుంటున్నారు. 20 లీటర్ల క్యాన్ 5 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. వేసవి కాలంలో ఒక్కో కుటుంబానికి కనీసం 2 క్యాన్లు అవసరమవుతున్నాయి. తాగునీటి కోసమే నెలకు 500 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని ప్రజలు పోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ చూపి నీటిని సరఫరా చేయాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి..