ETV Bharat / state

చేనేతకు సాంకేతికత తోడైంది... నేతన్న కష్టం తీర్చింది...

ముడి సరుకు తీసుకొచ్చి.. అందమైన వస్త్రం తయారుచేసేందుకు...రేయింబవళ్లు కష్టపడే నేతన్నల గురించి ఎంత చెప్పినా తక్కువే. శ్రమకు తగ్గ ఫలితం లేకున్నా... వారసత్వంగా వచ్చిన నేతవృత్తిని మాత్రం ఎట్టిపరిస్థితుల్లో వదులుకోరు. ఆ కష్టాన్ని చిన్నతనం నుంచి చూశారు కనుకే... ఏనాటికైనా వారి శ్రమ తగ్గించాలనుకున్నారు. దృఢ సంకల్పంతో పనిచేసి అధునాతన పద్ధతుల్లో 'ఈ-జాకార్డ్'​ యంత్రాన్ని రూపొందించారు కృష్ణా జిల్లా పెడనకు చెందిన శ్రీనివాసరావు.

ఈ-జాకార్డ్ చేనేత యంత్రం
author img

By

Published : Nov 10, 2019, 11:28 AM IST

చిన్నతనంలో చేనేత కార్మికుల కష్టాలు స్వయంగా చూసిన శ్రీనివాసరావు... ఏనాటికైనా వారి శ్రమ తగ్గించాలనే సంకల్పంతో అధునాతన ఈ-జాకార్డ్​ యంత్రానికి రూపకల్పన చేశారు. రాష్ట్రంలోని కృష్ణాజిల్లా పెడనకు చెందిన శ్రీనివాసరావుది...నేత కుటుంబం. ప్రస్తుతం ఆయన వరంగల్​ ఎన్​ఐటీలో అసిస్టెంట్​ ప్రొఫెసర్​గా పనిచేస్తున్నారు. తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు పడుతున్న కష్టాలను స్వయంగా చూసి వారి కష్టాన్ని ఏదో విధంగా తగ్గించాలని సంకల్పించారు. యంత్రాన్ని తొక్కాల్సిన అవసరం లేకుండా... ఒక చిన్న బటన్​తో నడిచే విధంగా అధునాతన ఈ - జాకార్డ్​ యంత్రాన్ని రూపొందించారు.

ఎక్కువ డిజైన్లకు ఎక్కువ కష్టం

సాధారణంగా... జాకార్డ్‌ యంత్రాల్లో ఆకృతి(డిజైన్) కోసం అట్టముక్కలను ఏర్పాటు చేసుకొని కాలుతో యంత్రాన్ని తొక్కుతుంటేనే అది నడుస్తుంది. డిజైన్‌ కావాలంటే అట్టముక్కలు లోపల అమర్చాల్సి వచ్చేది. చీరపై రెండు మూడు రకాల డిజైన్లు వేయాలంటే ఒక్కో ఆకృతికి ఒక్కో రకమైన అట్టముక్కలను యంత్రంలో అనుసంధానించాలి. దీనివల్ల జాకార్డు చీరల తయారీ వ్యయ ప్రయాసలతో కూడుకున్నదిగా మారింది.

ఈ-జాకార్డ్ చేనేత యంత్రం

తక్కువ శ్రమతో వీలైనన్ని డిజైన్లు

ఏ డిజైన్.. ఎప్పుడు కావాలంటే అప్పుడు మెమొరీ కార్డులో పెట్టుకుని మార్చుకోవడానికి వీలుండేలా జాకార్డ్​ యంత్రాన్ని తయారు చేశారు శ్రీనివాసరావు. మెమొరీ కార్డు నుంచి ఆకృతిని.. ఎలక్ట్రానిక్ యంత్రం తీసుకున్నప్పుడు అందులో అమర్చిన మైక్రో ప్రాసెసర్ ద్వారా చిన్న మోటార్లు నడుస్తాయి. దీని ద్వారా తక్కువ సమయంలో.... తక్కువ ఖర్చుతో సులువుగా వీలైనన్ని ఎక్కువ డిజైన్లతో వస్త్రాలను అందంగా నేయవచ్చు.

అందరికీ అందుబాటులో

ఇంజినీరింగ్ మూడో సంవత్సరం విద్యార్థి వసంత్‌రెడ్డి కూడా ఈ యంత్ర రూపకల్పనలో... శ్రీనివాసరావుతో కలసి పనిచేస్తున్నారు. యంత్రం కొనుగోలు ఖర్చు అందరికీ అందుబాటులోనే ఉంటుందని తెలిపారు.

శ్రమ తగ్గుతుంది

రో రెండు నెలల్లో మిగిలిన పనులు పూర్తి చేసి...ఆకర్షణీయమైన రీతిలో ఈ - జాకార్డ్​ యంత్రం పూర్తిగా రూపొందిస్తామని శ్రీనివాసరావు తెలిపారు. దీని ద్వారా నేతన్నల శ్రమ తగ్గుతుందని ధీమా వ్యక్తం చేశారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.