విజయవాడ నగరంలో నిరాశ్రయులు రోడ్డుపైనే ఆవాసం చేసుకొని జీవనం సాగిస్తున్నారు. చలికి వణుకుతూ.. కనీసం కప్పుకునేందుకు దుప్పట్లు సైతం లేని దయనీయ స్థితిలో కొందరు ఉన్నారు. అలాంటి వాళ్లకు ఆశ్రయం కల్పించేందుకు విజయవాడ మున్సిపల్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. నగరంలోని హనుమాన్‌పేట, రాణిగారితోట, సితార జంక్షన్, రైల్వేస్టేషన్ సమీపంలో ప్రాంతాల్లో మొత్తం నాలుగు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. రోడ్లపై నిద్రిస్తున్న, నిరాశ్రయులను పునరావాసాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. డిసెంబరు 6వ తేదీ వరకు ఈ ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అవాసం లేనివాళ్లకు అవగాహన కల్పించి కేంద్రాలకు తరలిస్తున్నారు.
నిరాశ్రయుల కోసం పునరావాస కేంద్రాల ఏర్పాటు
చలికి వణుకుతూ రోడ్లపై నివాసముంటు ఇబ్బంది పడుతున్న నిరాశ్రయుల కోసం విజయవాడ మున్సిపల్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. నగరంలో పలు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆవాసం లేని వారిని అక్కడకి తలిస్తున్నారు.
విజయవాడ నగరంలో నిరాశ్రయులు రోడ్డుపైనే ఆవాసం చేసుకొని జీవనం సాగిస్తున్నారు. చలికి వణుకుతూ.. కనీసం కప్పుకునేందుకు దుప్పట్లు సైతం లేని దయనీయ స్థితిలో కొందరు ఉన్నారు. అలాంటి వాళ్లకు ఆశ్రయం కల్పించేందుకు విజయవాడ మున్సిపల్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. నగరంలోని హనుమాన్‌పేట, రాణిగారితోట, సితార జంక్షన్, రైల్వేస్టేషన్ సమీపంలో ప్రాంతాల్లో మొత్తం నాలుగు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. రోడ్లపై నిద్రిస్తున్న, నిరాశ్రయులను పునరావాసాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. డిసెంబరు 6వ తేదీ వరకు ఈ ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అవాసం లేనివాళ్లకు అవగాహన కల్పించి కేంద్రాలకు తరలిస్తున్నారు.
TAGGED:
vmc latest news