కృష్ణా జిల్లాలో ఈనెల 20 నుంచి 26 వరకు గ్రామ సచివాలయ పోస్టుల నియామక పరీక్షలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతా పకడ్భందీగా నిర్వహించాలని... జిల్లా పాలనాధికారి ఇంతియాజ్ అహ్మద్ సిబ్బందిని ఆదేశించారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజలేటర్లకు తొలివిడత శిక్షణ నిర్వహించారు.
గత ఏడాది జిల్లాలోని 845 గ్రామ, 450 వార్డు సచివాలయాలకు నిర్వహించిన పరీక్షల ద్వారా 9,564 మంది నియమితులయ్యారని, మరో 1425 పోస్టుల భర్తీకి... లక్ష 19 వేల 515 మంది అభ్యర్ధులు హాజరు కానున్నారని కలెక్టర్ తెలిపారు. ఈ పరీక్షల కోసం 550 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: