ప్రజలకు ప్రభుత్వ పాలన చేరువ చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు పేర్కొన్నారు. కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామంలో 40 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న గ్రామ సచివాలయ భవనానికి, 25 లక్షలరూపాయల నిధులతో నిర్మించనున్న రైతు భరోసా కేంద్రం భవనానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
దాదాపు 715 రకాల సేవలను వినియోగించుకునేలా గ్రామ సచివాలయాలను రూపొందించారని తెలిపారు. ప్రజలు దరఖాస్తు చేసుకునే ప్రతి అర్జీని నిర్ణీత కాల సమయంలోనే పూర్తి చేయాలనే ఆదేశాలతో గ్రామ సచివాలయ ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు.
ఇదీ చూడండి : రాష్ట్రంలో పదివేలకు చేరువలో కరోనా కేసులు