విజయవాడలో రెండు గ్యాంగ్‌ల మధ్య సినీ తరహాలో జరిగిన ఘర్షణ కలకలం రేపుతోంది. కత్తులు, కర్రలతో ఇరువర్గాలు దాడులు చేసుకున్నాయి. ఓ అపార్ట్మెంట్ విషయంలో మణికంఠ, తోట సందీప్ అనే ఇద్దరి మధ్య రేగిన వివాదం... ఘర్షణకు దారితీసిందని విజయవాడ డీసీపీ హర్షవర్థన్ తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నామని ఆయన అన్నారు. ఘటనపై కేసులు నమోదు చేసి ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని డీసీపీ తెలిపారు.
ఇదీ చదవండి:
విజయవాడలో విద్యార్థుల గ్యాంగ్ వార్.. పలువురికి తీవ్ర గాయాలు