కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పట్టణం డాంగే నగర్ ఎన్జీవోస్ కాలనీ లో ఉద్యోగస్తులకు ప్రభుత్వం ఇచ్చిన స్థలాలను... అధికార పార్టీకి చెందిన కొందరు రాజకీయ నేతలు ఆక్రమించారని బాధితులు వాపోతున్నారు. 1981లో అప్పటి ప్రభుత్వం ఈ ఇళ్ల స్థలాలను ఇవ్వగా ఆర్థిక కారణాలతో కొందరు నిర్మించుకొలేక పోయారు. దీన్ని అదునుగా తీసుకున్న కొంత మంది అధికార పార్టీ నేతలు దొంగ పటాలను సృష్టించి వాటిని ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకొంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ అండతో కొందరు దుండగులు ఈ చర్యలకు పాల్పడుతున్నారని...దీంతో నిజమైన లబ్ధిదారులు నష్టపోతున్నారని తెలుగుదేశం నేత, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య అన్నారు. ఈ విషయంపై న్యాయ విచారణ కొరకు తహసీల్దార్ , కలెక్టర్కు అర్జీలు అందజేస్తామని తెలిపారు.
ఇదీ చదవండీ... అధికారులతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ మరోసారి రద్దు