రాష్ట్రంలో రెండు రోజులపాటు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రత్యేక విమానంలో కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. మంత్రి కొడాలి నాని, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా, విజయవాడ సీపి ద్వారకా తిరుమలరావు, భాజపా నేతలు విష్ణుకుమార్ రాజు, కామినేని శ్రీనివాస్‌లు వెంకయ్యకు ఘనస్వాగతం పలికారు. రోడ్డు మార్గంలో ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్టుకు వెళ్లారు.
ఇదీ చూడండి: గన్నవరం విమానాశ్రయ కార్గో విభాగం వెలవెల