ETV Bharat / state

మరింత అందంగా భాగ్యనగరం..

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మహానగర సుందరీకరణలో భాగంగా జీహెచ్​ఎంసీ రోజుకో కార్యాచరణ చేపడుతోంది. నిరుపయోగ వస్తువుల సేకరణ, పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఇప్పటికే ప్రణాళికలు ఖరారు చేసిన బల్దియా... తాజాగా నగరంలోని జంక్షన్‌లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పలు జంక్షన్ల వద్ద అధికారులు బ్యూటిఫికేషన్ థీమ్స్‌ను సైతం ఏర్పాటు చేశారు.

author img

By

Published : Nov 20, 2019, 7:57 AM IST

హైదరాబాద్ లో వర్టికల్ గార్డెన్ కోసం ఏర్పాట్లు
మరింత అందంగా భాగ్యనగరం

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌ను మరింత అందమైన నగరంగా మార్చేందుకు బల్దియా కార్యాచరణ రూపొందించింది. ఇప్పటికే డంప్ యార్డుల వద్ద గార్డెన్‌లు, మొక్కలు పెడుతూ వచ్చిన జీహెచ్​ఎంసీ... ఈసారి జంక్షన్లను అందంగా అలంకరించాలని నిర్ణయించింది. ఖైరతాబాద్‌ ప్రధాన కూడలిలోని పైవంతెన వద్ద పొడవైన వర్టికల్‌ గార్డెన్‌ ఏర్పాటు చేస్తోంది. గార్డెన్ వెనక భాగంలో జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య వాహనాల పార్కింగ్‌ ఉండడం.. ఈ మార్గంలో వెళ్లేవారు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. స్వచ్ఛత పంచాలన్న ఆలోచనతో ఖైరతాబాద్‌ జోనల్‌ అధికారులు... వర్టికల్‌ గార్డెన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీకి చెందిన పలు ప్రదేశాల్లో వర్టికల్‌ గార్డెన్లను నిర్వహిస్తున్న గ్రీన్‌లైఫ్‌ సంస్థకు ఈ ప్రాజెక్టును అప్పగించారు.

వర్టికల్ గార్డెన్...
అందంతో పాటు ఆహ్లాదం, ప్రాణవాయువు పంచేలా వర్టికల్‌ గార్డెన్‌ని 2,600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో బ్లాకు 7 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు చొప్పున మొత్తం ఏడు బ్లాకులతో గార్డెన్ సిద్ధవుతోంది. ఈ ఫ్రేమ్‌ వర్క్‌తో పాటు వంతెన గ్రిల్స్‌ భాగంలోనూ మరో ఫ్రేమ్‌ను ఆయా బ్లాక్‌లకు అనుసంధానిస్తూ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి బ్లాక్‌లోనూ 600 మొక్కలకు అవసరమైన కుండీలు సిద్ధం కానున్నాయి. సుమారు 10 రకాల మొక్కలను... మొత్తం అన్ని బ్లాకులు కలిపి 4,200 మొక్కలు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం ప్యానల్‌ పనులు కొనసాగుతున్నాయి.

'ఐ లవ్‌ హైదరాబాద్‌'...
వీటితో పాటు అన్ని బ్లాక్‌లకూ డ్రిప్‌ ఇరిగేషన్‌ విధానంలో నీటి సరఫరాకు పైపులైన్‌ ఏర్పాటు చేస్తారు. నీటిని అందించేందుకు అవసరమైన ప్రధాన పైపులైన్‌ను ఇప్పటికే సిద్ధం చేశారు. మొక్కల నిర్వహణ బాధ్యతనూ ఏర్పాటు చేసిన సంస్థే చూసుకోనుంది. ఈ గార్డెన్‌లో మొక్కల మధ్యలో ఆంగ్లంలో 'ఐ లవ్‌ హైదరాబాద్‌' చిహ్నం ఏర్పాటు చేయనున్నారు. లవ్‌ అనేది అక్షరాల్లో కాకుండా రక్తపు వర్ణంలో ఉండే మొక్కలతో హృదయాకారంలో తీర్చిదిద్దుతారు. మిగతా చిహ్నంలో ఎరుపు, ఆకుపచ్చ మొక్కలు ఉండనున్నాయి.

నగరాన్ని కాలుష్య కోరల నుంచి రక్షించడం సహా.... ప్రజల మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చే కార్యక్రమాలను రూపొందించడమే లక్ష్యంగా బల్దియా వడివడిగా అడుగులు వేస్తోంది.

ఇదీ చూడండి: ఎలుగు బంటిని శునకాలు ఎలా తరిమికొట్టాయో చూశారా...

TG_HYD_01_20_Verticle_Gardens_in_junctions_Pkg_3182301 Reporter: Kartheek () హైదరాబాద్ నగరంలో బోసిపోయిన జంక్షన్ లను అభివృద్ధి చేయాలని జీహెచ్ంసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు జంక్షన్ల వద్ద నగర వాసుల మనసు దోచే విధంగా బ్యూటిఫికేన్ థీమ్స్ ను ఏర్పాటు చేశారు. ఇక ఇటూ కాలుష్య కోరల నుంచి కాపాడుతూ.... ప్రజల మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చే విధంగా నగరంలోని జంక్షన్ల వద్ద వెర్టికల్ గార్డెన్లను ఏర్పాటు చేస్తోంది. మొదట విడతగా ఖైరతాబాద్ లో నెలకొల్పుతున్నారు..దీనికి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. Look వాయిస్ ఓవర్‌ః హైదరాబాద్ ను మరింత అందమైన నగరంగా మార్చేందుకు బల్దియా కార్యచరణ రూపొందించింది. ఇప్పటికే డంప్ యార్డుల వద్ద గార్డెన్ లు... మొక్కలు పెడుతూ వచ్చిన బల్దియా ఈసారి జంక్షన్లను అందంగా అలంకరించాలని ప్లాన్ చేసింది. ఖైరతాబాద్‌ ప్రధాన కూడలిలోని పైవంతెన వద్ద పొడవైన వర్టికల్‌ గార్డెన్‌ ఏర్పాటు చేస్తోంది. వర్టికల్ గార్డెన్ వెనకాల జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య వాహనాల పార్కింగ్‌ ప్రదేశం ఉండడంతో.. దుర్వాసన ఎక్కువగా వస్తుంటుంది. ఈ మార్గంలో వెళ్లేవారు దుర్వాసనతో తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. ఈ దుర్వాసనను దూరం చేసి స్వచ్ఛత పంచాలన్న ఆలోచనతో ఖైరతాబాద్‌ జోనల్‌ అధికారుల వర్టికల్‌ గార్డెన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీకి చెందిన పలు ప్రదేశాల్లో వర్టికల్‌ గార్డెన్లను నిర్వహిస్తున్న గ్రీన్‌లైఫ్‌ సంస్థకు దాదాపు రూ. 32 లక్షల వ్యయంతో చేపట్టే ఈ పనులను అప్పగించారు. వాయిస్ ఓవర్ః అందంతో పాటు ఆహ్లాదం, ప్రాణవాయువు పంచేలా వర్టికల్‌ గార్డెన్‌ని 2600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో బ్లాకు 7 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు చొప్పున మొత్తం ఏడు బ్లాకులు గార్డెన్ సిద్ధవుతోంది. ఈ ఫ్రేమ్‌ వర్క్‌తో పాటు వంతెన గ్రిల్స్‌ భాగంలోనూ మరో ఫ్రేమ్‌ను ఆయా బ్లాక్‌లకు అనుసంధానిస్తూ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి బ్లాక్‌లోనూ 600 మొక్కలకు అవసరమైన కుండీలు సిద్ధం కానున్నాయి. సుమారు 10 రకాల మొక్కలను..మొత్తం అన్ని బ్లాకులు కలిపి 4200 మొక్కలు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం ప్యానల్‌ పనులు కొనసాగుతున్నాయి. ఇవి పూర్తి కాగానే అన్ని బ్లాక్‌లకూ డ్రిప్‌ ఇరిగేషన్‌ విధానంలో నీటి సరఫరాకు పైపులైన్‌ ఏర్పాటు చేస్తారు. నీటిని అందించేందుకు అవసరమైన ప్రధాన పైపులైన్‌ను ఇప్పటికే సిద్ధం చేశారు. మొక్కల నిర్వహణ బాధ్యతనూ ఏర్పాటు చేసిన సంస్థే చూసుకోనుంది. ఈ గార్డెన్‌లో మొక్కల మధ్యలో ఆంగ్లంలో ఐ లవ్‌ హైదరాబాద్‌ చిహ్నం ఏర్పాటు చేయనున్నారు. లవ్‌ అనేది అక్షరాల్లో కాకుండా రక్తపు వర్ణంలో ఉండే మొక్కలతో హృదయాకారంలో తీర్చిదిద్దుతారు. మిగతా చిహ్నంలో ఎరుపు, ఆకుపచ్చ మొక్కలు ఉండనున్నాయి. ఎండ్....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.