ETV Bharat / state

హక్కులు హరించేలా పోలీసు వ్యవస్థ తీరు ఉంది: వర్లరామయ్య - డీజీపీకి వర్ల రామయ్య లేఖ

పోలీసు శాఖకు కేసుల దర్యాప్తులో అసలు ముద్దాయిలను త్వరితగతిన అరెస్టు చేయమని చంద్రబాబు లేఖలో కోరడం తప్పా అని తెదేపా సీనియర్‌ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. చంద్రబాబు రాసిన లేఖకు పోలీసులు స్పందించిన తీరు గర్హనీయమని వర్ల రామయ్య డీజీపీకి మరో లేఖ రాశారు.

varla Ramaiah
varla Ramaiah
author img

By

Published : Oct 8, 2020, 10:09 AM IST

కేసుల దర్యాప్తులో అసలు నిందితులను త్వరితగతిన అరెస్టు చేయమని చంద్రబాబు.. పోలీసులను లేఖలో కోరడం తప్పా అని తెదేపా సీనియర్‌ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. చంద్రబాబు రాసిన లేఖకు పోలీసులు స్పందించిన తీరు గర్హనీయమంటూ.. వర్ల రామయ్య డీజీపీకి మరో లేఖ రాశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ తీరు భావస్వేచ్చ హక్కు హరించేలా ఉందని విమర్శించారు.

రాజమహేంద్రవరంలో ఓ బాలికపై బలవంతం చేయడానికి ప్రయత్నించిన నిందితుల అరెస్టులో జాప్యమెందుకని ప్రశ్నించడం చంద్రబాబు చేసిన తప్పా అని నిలదీశారు. బాధితుల ఇంటిపై దాడి చేసి ఫిర్యాదు వాపసు తీసుకోమని బెదిరించింది నిజం కాదా అని ప్రశ్నించారు. బాధిత కుటుంబాన్ని బయటకురానీయకుండా కాపలా కాసింది నిజమా కాదా చెప్పాలన్నారు. బాలిక తండ్రి ఆత్మహత్యా ప్రయత్నానికి కారణం పోలీసులు చెప్పాలని కోరారు.

దర్యాప్తులు పర్యవేక్షిస్తున్న సీనియర్ పోలీసు అధికారులు కాకుండా ఆఫీసులో కూర్చునే టెక్నికల్ డీఐజీ... కేసుల గురించి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబును తప్పు పట్టడం సబబు కాదన్నారు. ఇప్పటికైనా డీజీపీ ఈ కేసులన్నింటిని సమీక్షించి రాష్ట్ర ప్రజలకు ధైర్యాన్నిస్తూ యాక్షన్ టెకెన్ రిపోర్ట్ ప్రజల ముందుంచాలని కోరారు.

ఇదీ చదవండి: నేడు జగనన్న విద్యా కానుక పథకం ప్రారంభించనున్న సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.