న్యాయ వ్యవస్థపై వ్యాఖ్యానించినందుకు శాసన సభాపతి తమ్మినేని క్షమాపణలు చెప్పాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రభుత్వం తరఫునా, వ్యక్తిగతమో తేల్చి చెప్పాలన్నారు. అలాగే ఆర్థిక బిల్లును మండలి అడ్డుకున్న చరిత్ర ప్రపంచంలో లేదంటూ తమ్మినేని చేసిన వ్యాఖ్యలను వర్ల తప్పుబట్టారు.
మండలిలో జరిగిన అంశంపై రాజకీయంగా మాట్లాడి చట్టసభల నిబంధనలను ఉల్లంఘించారు. శాసనసభకు స్పీకర్గా ఉంటూ మరో చట్ట సభను కించ పరచడం రాజ్యాంగాన్ని అవమానపరచడమే. స్పీకర్ చట్టసభల పరిధిని గుర్తించి మసలుకోవాలి. రాజ్యాంగ వ్యవస్థల్లోని లోపాలను ఎత్తి చూపే అవకాశం న్యాయ వ్యవస్థకు ఉంది. అంత ప్రాధాన్యమున్న న్యాయ వ్యవస్థపై వ్యాఖ్యానించినందుకు కోర్టు ఉల్లంఘన కిందకు వస్తుంది - వర్ల రామయ్య