లాక్డౌన్తో రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఫలితంగా పల్లెల్లో సారా విక్రయాలు జోరందుకున్నాయి. కృష్ణా జిల్లా చాట్రాయి మండలం పోతనపల్లి గ్రామంలో అక్రమంగా నాటుసారా తయారు చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నాటుసారా వల్ల కలిగే అనర్థాలను వారికి వివరించి, అవగాహన కలిగించారు. అర్థం చేసుకున్న నాటుసారా తయారీ దారులు తయారీకి వాడే పాత్రలను స్థానిక ఎస్ఐ శివన్నారాయణకు అప్పగించారు. దీనిపై పోలీసులు వారిని ప్రశంసించారు.
ఇదీ చదవండి..