ETV Bharat / state

పాత కంచల సర్పంచి అభ్యర్థి వాహనం దగ్ధం - కృష్ణాజిల్లా తాజా వార్తలు

కృష్ణాజిల్లా నందిగామ మండలం పాత కంచల తెదేపా మద్దుతుదారుడైన సర్పంచ్ అభ్యర్థి వెంకటలక్ష్మికి చెందిన ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు.

పూర్తిగా దగ్దమైన వాహనాలు
పూర్తిగా దగ్దమైన వాహనాలు
author img

By

Published : Feb 7, 2021, 1:58 PM IST

కృష్ణా జిల్లా నందిగామ మండలం పాత కంచలలో.. తెదేపా బలపర్చిన సర్పంచ్​ అభ్యర్థి వాహనాలను.. గుర్తుతెలియని వ్యక్తులు దహనం చేశారు. అభ్యర్థి వెంకటలక్ష్మి స్కూటీతోపాటు.. ఆమె భర్త వెంకటరమణకు చెందిన బైక్‌ను తగులబెట్టారు. దీనిపై బాధితులు.. నందిగామ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఖండించిన మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య..

ఎన్నికలలో పోటీ చేస్తే భయబ్రాంతులకు గురి చేస్తారా? అని మాజీ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య ప్రశ్నించారు. పాత కంచల సర్పంచ్ అభ్యర్థి పెర్న వెంకటలక్ష్మీ, రమణల వాహనాలను తగలబెట్టిన ప్రదేశాన్ని తెదేపా నేతలతో కలిసి ఆమె పరిశీలించారు. ఎన్నికల సమయంలో ఇలాంటి ఘటనలు దురదృష్టకరమన్నారు. గతంలో ఎన్నడూ గ్రామంలో ఈ విధంగా జరగలేదని, హుందాతనంగా ఎన్నికలలో పోటీ చేయాలి తప్ప ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇదీ చదవండి: 'విశాఖ ఉక్కు పోరాటంలో ఇది మొదటి మెట్టు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.