విజయవాడ గాంధీనగర్ రామాటాకీస్ వెనక వీధిలో రోడ్డు పక్కన కారు ఆపి నిలబడిన వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. సెల్ ఫోన్లో మాట్లాడుతుండగా... మెహంపై దాడికి దిగారు. తీవ్ర రక్త స్రావంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ బాధితుడిని పోలీసులు గుర్తించి జీజీహెచ్‌కు తరలించారు.
బాధితుడిని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సింహాచలంగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సత్యనారాయణపురం పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సింహాచలంపై దాడి చేసిన వారిని గుర్తించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు.
ఇదీ చూడండి: