ETV Bharat / state

నందిగామలో పూర్తి కాని ప్రకృతి యోగా చికిత్సాలయం - నందిగామలో ప్రకృతి యోగా చికిత్సాలయ భవనం తాజా వార్తలు

కృష్ణాజిల్లా నందిగామలో ప్రకృతి యోగా చికిత్సాలయానికి అనుమతులు లభించినా..భవన నిర్మాణం మాత్రం జాప్యం జరుగుతోంది. భవనాన్ని నిర్మించి... చికిత్సాలయంలో సిబ్బందిని నియమించాలని ప్రజలు కోరుతున్నారు స్థానికులు.

Unfinished  construction of Nature Yoga Clinic Building in Nandigama
నందిగామలో పూర్తిచేయని ప్రకృతి యోగా చికిత్సాలయ భవనం
author img

By

Published : Nov 7, 2020, 2:08 PM IST

కృష్ణాజిల్లా నందిగామలో యోగ ప్రకృతి చికిత్సాలయ భవన నిర్మాణాన్ని అధికారులు పూర్తిచేయడంలేదు. నందిగామలో యోగ ప్రకృతి చికిత్సాలయం ఏర్పాటుకు ప్రభుత్వం 2018లో ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భవన నిర్మాణానికి 20 లక్షల రూపాయలను మంజూరు చేసింది. 2018 ఏప్రిల్ 18న నందిగామ రైతు బజార్ సమీపంలో ఎన్​సీపీ స్థలంలో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు .కేవలం పునాదులు లేపి స్లాబ్ వేసి వదిలేశారు. అప్పటి నుంచి నిర్మాణ పనులు తిరిగి చేపట్టలేదు. ప్రకృతి చికిత్సాలయం ఏర్పాట్లు జాప్యం జరగడంతో... యోగ, చికిత్సలు వృద్ధులు, యువకులు, రోగులకు అందుబాటులో లేకుండా పోయాయి. వైద్యశాల అందుబాటులోకి వస్తే యోగ ఆసనాలు నేర్పించేందుకు ప్రకృతి చికిత్స అందించేందుకు ఆయా విభాగాల్లో నిపుణులను నియమిస్తారు. సిబ్బందిని నియమించలేదు. వెంటనే ప్రభుత్వం భవన నిర్మాణం పూర్తి చేయించి సిబ్బంది నియమించాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చూడండి. మందు బాబుల వీరంగం.. రెచ్చిపోయిన పోలీసులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.