ETV Bharat / state

బైకును ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు: ఇద్దరు మృతి - కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి

భీమవరం నుంచి హైదరాబాద్​కు వెళ్తున్న బీఎస్ఆర్ ట్రావెల్స్ బస్సు... ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. కృష్ణా జిల్లా ఉయ్యూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ఇద్దరు మృతిచెందారు.

two people are road accident at Uyyuru in krishna district
కృష్ణా జిల్లా ఉయ్యూరులోని రోడ్డు ప్రమాదంలో విగత జీవులుగా పడి ఉన్న ఇద్దరు వ్యక్తులు
author img

By

Published : Dec 8, 2019, 4:43 PM IST

బైకును ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు: ఇద్దరు మృతి

కృష్ణా జిల్లా ఉయ్యూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. బీఎస్ఆర్ ట్రావెల్స్​​కు చెందిన బస్సు భీమవరం నుంచి హైదరాబాద్ వెళ్తోంది. ఈ క్రమంలో ఉయ్యూరు ఫ్లైఓవర్​పై శనివారం అర్ధరాత్రి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు ఉయ్యూరు పట్టణానికి చెందిన పందేటి కిరణ్, కొడాలి ప్రదీప్​కుమార్​గా పోలీసులు గుర్తించారు. సీఐ నాగప్రసాద్, పట్టణ ఎస్సై గురుప్రకాష్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండీ:

కోడలిపై రోకలి బండతో మామ దాడి

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.