కొడుకు ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కోపంతో కోడలిపై దాడి చేశాడో వ్యక్తి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన రమణారెడ్డి కుమారుడు శ్రీనివాసులు రెడ్డి.. ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తండ్రికి నచ్చలేదు. ఫలితంగా నవ దంపతులు కొంతకాలంగా గూడురులో నివాసమున్నారు. ఇటీవలే ఉద్యోగం వచ్చాక.... స్వగ్రామానికి వెళ్లి అక్కడే ఉంటున్నారు. అప్పటికే కోడలుపై కోపంతో ఉన్న మామ.. తన కుమారుడు లేని సమయంలో కోడలిపై బండతో మోదాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
ఇవి కూడా చదవండి: