వేములపల్లి శివ శంకర్, విజయ్ శంకర్ అనే ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను గుడివాడలో అరెస్టు చేసినట్లు కృష్ణాజిల్లా అడిషనల్ ఎస్పీ మల్లికా గార్గ్ తెలిపారు. వారి నుంచి రూ. 10 లక్షల విలువైన బంగారు, వెండి నగలు స్వాధీనం చేసుకున్నట్లు.. స్థానిక ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 2015 నుంచి ఈ నిందితుల మీద తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: గుట్టలుగా మృతదేహాలు.. ఖాళీలేని శ్మశానాలు!
గుడివాడ శ్రీనివాస కూడలిలో రోజువారీ తనిఖీల్లో భాగంగా.. నిందితులైన అన్నదమ్ములు ఇరువురినీ అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్పీ చెప్పారు. చెడు వ్యసనాలకు బానిసలై దొంగలుగా మారారన్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిస్తున్నామని తెలిపారు. అనంతరం వారిని పట్టుకున్న సిబ్బందికి డీఎస్పీ సత్యానందంతో కలిసి బహుమతులు అందజేశారు.
ఇదీ చదవండి: అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం.. సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం