ETV Bharat / state

ఇబ్రహీంపట్నంలో అగ్నిప్రమాదం-12 లారీలకు మంటలు - ఇబ్రహీంపట్నం

ఇబ్రహీంపట్నంలోని ట్రక్ టెర్మినల్‌ వద్ద అగ్నిప్రమాదం జరిగి 6 లారీలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. సుమారు 2 కోట్ల రూపాయలు నష్టం ఉంటుందని ప్రాథమిక అంచనా.

trucks-fire-accident-in-ap-krishna-district
author img

By

Published : Jun 24, 2019, 9:10 AM IST

trucks-fire-accident-in-ap-krishna-district

విజయవాడ నగర శివారులోని ఇబ్రహీంపట్నం ట్రక్‌టెర్మినల్‌ వద్ద అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 12 లారీలు మంటల్లో చిక్కుకున్నాయి. ఆరు లారీలు పూర్తిగా కాలిపోయాయి. మరో ఆరు లారీలు పాక్షికంగా దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదానికి గురైన లారీలు సౌత్‌ ఇండియా లారీ ట్రాన్స్‌పోర్టుకు చెందినవిగా పోలీసులు పేర్కొన్నారు. అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఈ వాహనాలకు సమీపంలోనే మరో 35 వాహనాల వరకు ఉన్నాయి. అయితే వాటికి మంటలు విస్తరించకుండా వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకొన్నారు. సుమారు 2కోట్ల రూపాయల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శకటాలు- మంటలు విస్తరించకుండా చూశారు. విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు అగ్నిప్రమాదానికి గురైన వాహనాలు పరిశీలించి- యజమానితో మాట్లాడారు. ప్రమాదానికి కారణాలపై పోలీసులు, అగ్నిమాపక అధికారులు దర్యాప్తు చేపట్టారు. గత కొన్నేళ్లుగా సౌత్‌ ఇండియా లారీ ట్రాన్స్‌పోర్టు యజమాని శ్యాంప్రసాద్‌ ఆర్ధికంగా నష్టాలు ఎదుర్కొంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రమాదానికి అగ్నిప్రమాదమేనే లేక మరే ఇతర అంశాలు కారణమై ఉంటాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు..

Intro:పంట పొలాలపై ఏనుగుల దాడులుBody:చిత్తూరు జిల్లా పలమనేరు మండల పరిధిలో అటవీ ప్రాంత సమీపంలోని గ్రామాలపై ఏనుగుల దాడులు కొనసాగుతున్నాయి. శనివారం రాత్రి అటవీ సమీపంలో గల బయ్యప్పగారిపల్లె పంచాయతీ ఊసరపెంట గ్రామంలో రైతుల పంటపొలాలపై ఒంటరిఏనుగు దాడి చేసింది. వరసగా శుక్రవారం, శనివారం రెండు రోజులు రాత్రి పూట గ్రామంలోని భాస్కర్ నాయుడు అనే రైతుకు చెందిన ఒక ఎకరా చెరకు తోటలో ప్రవేశించి తోటను పూర్తిగా ద్వంసం చేసింది. ఇదేవిదంగా గత 4 నెలలుగా ఒంటరి ఏనుగుతోపాటు, గుంపులవారిగా వచ్చి రైతులు అష్టకష్టాలు పడి అప్పులు చేసి వేసిన చెరకు, మామిడి ,రాగులు, టమోటా, అరటి వంటి పంటలను పూర్తిగా నష్టపరుస్తూనే ఉన్నాయి. ఒక వైపు వేసిన పంటలు చేతికందక నష్టపోతుంటే మరోవైపు ఏనుగులు, జింకల ద్వారా నష్టపోతున్నారు. పంటనష్టాలకు ప్రభుత్వం ద్వార నష్టపరిహారం కూడా అందక రైతులు అష్టకష్టాలుపడుతున్నారు.Conclusion:రోషన్
ఈటీవీ భారత్
పలమనేరు
7993300491
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.