భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జన్మస్థలమైన భట్లపెనుమర్రులో.. పింగళికి ఘన నివాళి అర్పించారు. జాతీయ పతాకం రూపొందించి వంద సంవత్సరాలు అయిన సందర్భంగా ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పింగళి వెంకయ్య విగ్రహానికి పూలమాల వేశారు. జాతీయ పతాకాన్ని రూపొందించి తెలుగువారి కీర్తిని నలుదిశలా వ్యాపింపజేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.
పింగళి వెంకయ్య చిన్నతనంలో తాతయ్య చలపతిరావు వద్దే ఉండి భట్లపెనుమర్రులో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారని గుర్తుచేసుకున్నారు. ఆయన జన్మించిన స్థలాన్ని గ్రామస్తులు దాతల సహకారంతో స్మారక భవనం, కల్యాణ మండపం నిర్మించి గ్రామ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా వినియోగిస్తున్నారు. దేశానికి చేసిన సేవకు గుర్తింపుగా పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని గ్రామస్తులు కోరారు.
ఇదీ చదవండి: