కృష్ణా జిల్లా(krishna district) తోట్లవల్లూరు వద్ద విషాదం నెలకొంది. కృష్ణా నదిలో కార్తిక స్నానాలకు దిగి ముగ్గురు యువకులు(three young mans missing) గల్లంతయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా.. మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తోట్లవల్లూరు గ్రామానికి చెందిన నరేంద్ర, నాగరాజు, పవన్‌లు .. కార్తిక స్నానాలు చేసేందుకు తోట్లవల్లూరు కృష్ణానది పాయలోకి వెళ్లారు. నీటిలో స్నానం చేస్తుండగా ప్రమదవశాత్తు ముగ్గరు యువకులు గల్లంతయ్యారు. ప్రమాద సూచికలు ఏర్పాటు చేయకపోవటమే ఈ విషాదానికి కారణమని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి