శ్రీలంకలో జరిగిన అంతర్జాతీయ స్టూడెంట్ ఒలంపిక్ యోగాలో కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన ముగ్గురు విద్యార్థులు బంగారు పతకాలు సాధించారు. అండర్-22 బాలికల విభాగంలో తల్లాప్రగడ సాయి ప్రసన్న లక్ష్మి, అండర్-22 బాలుర విభాగంలో శ్రీకాంత్, అండర్-8 విభాగంలో ఎం.జనార్థన రాజారామచంద్ర చార్యులు ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ నెల 15,16,17వ తేదీల్లో శ్రీలంక రాజధాని కొలంబోలో ఈ పోటీలు జరిగాయి. తన తల్లిదండ్రుల ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధించానని, వారి స్పూర్తితోనే శిక్షణ సంస్థను ఏర్పాటు చేశానని ప్రసన్న లక్ష్మి తెలిపారు. ప్రసన్న లక్ష్మి ఆధ్వర్యంలో యోగా మెళకువలు నేర్చుని జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నామని శ్రీకాంత్,జనార్థన్ పేర్కొన్నారు. .
ఇదీ చూడండి: