తిరువూరులో దొంగతనం..బంగారం, నగదు చోరీ - తిరువూరు నేటి వార్తలు
కృష్ణా జిల్లా తిరువూరులో ఓ ఇంట్లో దొంగతనం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ అంశంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దొంగతనం జరిగిన ఇంట్లో చిందరవందరంగా పడేసిన వస్తువులు
కృష్ణా జిల్లా తిరువూరులో ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. పట్టణానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. తన బంధువుల ఇంటికి వెళ్లి బుధవారం వచ్చాడు. ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించిన రవికుమార్.. వంద గ్రాముల బంగారం, మూడు లక్షల రూపాయలు చోరీకి గురైనట్లు గుర్తించాడు. ఈ అంశంపై రవికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్ టీం దర్యాప్తు ఆధారంగా దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. రవికుమార్ ఇంటి పక్కనే ఉన్న న్యాయవాది ఇంట్లోనూ దొంగతనం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
ఇదీచదవండి.