కార్గిల్ అమరవీరులకు తిరుపతి ఎన్‌సీసీ ఘన నివాళులు అర్పించింది. భారత భూ భాగ రక్షణలో భాగంగా పాకిస్థాన్ సైన్యాన్ని తిప్పి కొట్టడంలో అమరులైన భారత జవాన్లకు నివాళులు అర్పించారు.కార్గిల్ యుద్ధం ముగిసి 20 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా విజయ్ దివాస్ నిర్వహించుకొంటున్నామని....భారత భూభాగాన్ని రక్షించడంలో అమరులైన 550 మంది భారత జవాన్లు తమ జీవితాలను త్యాగం చేశారని కల్నల్ గంగా సతీష్ అన్నారు..... కపిలతీర్థం సమీపంలోని అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలతో గౌరవ వందనం సమర్పించారు.
ఇదీ చూడండి:పబ్‌గా మారిన పేదల ఫంక్షన్ హాల్... చిందులేసిన నేతలు