కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ దేవాలయాన్ని త్వరలో తెరిచేందుకు దేవస్థానం అధికారులు చర్యలు చేపట్టారు. రెండు నెలలుగా దర్శనాలు నిలిపివేసిన అధికారులు..ఈనెల 8వ తేదీ తర్వాత భక్తులను అనుమతించేందుకు చర్యలు చేపట్టారు. అందుకుగాను దేవాలయంలో పూర్తి కరోనా వైరస్ నియంత్రణ చర్యలు చేపట్టారు.
గతంలో మాదిరి కాకుండా ఈసారి ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి దర్శనం టికెట్లను ఆన్లైన్ విధానంలో విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆలయ ఈవో ఎస్వీబీఎన్ మూర్తి తెలిపారు. ఆలయం మొత్తాన్ని ప్రత్యేక ద్రావణంతో శుభ్రం చేయడంతో పాటు.. భక్తులు భౌతిక దూరం పాటించేలా వృత్తాలు ఏర్పాటు చేసామన్నారు. క్యూ లైన్లోకి ప్రవేశించిన భక్తులు శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకునేలా ఏర్పాటు చేశామన్నారు. క్యూలైన్లో రెండుచోట్ల డిస్ ఇన్ఫెక్షన్ టన్నెల్ ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని తెలిపారు.
ఇది చదవండి రెడ్‌జోన్ ఎత్తేస్తే... నిబంధనలు గాలికొదిలేస్తారా?