స్పీకర్ పరిధిలోకి రాని అంశంపై వైకాపా ఎంపీలు అనర్హత పిటిషన్ ఇవ్వడం.. చట్టంపై వారికున్న అజ్ఞానాన్ని బయటపెట్టిందని శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. రఘురామకృష్ణరాజుపై అనర్హత పిటిషన్ ఒక డ్రామా అని విమర్శించారు. అనర్హతకు అవకాశమే లేదని స్పష్టం చేశారు.
సభ వెలుపల జరిగిన అంశాల ఆధారంగా అనర్హత వేటు పడదు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో ఇది స్పష్టంగా చెప్పారు. విప్‌ను ధిక్కరించి ఓటు వేసినా, సభకు గైర్హాజరు అయితే అనర్హత పరిధిలోకి వస్తారు. ఎంపీ రఘరామకృష్ణరాజు విషయంలో ఈ రెండూ జరగలేదు - యనమల రామకృష్ణుడు