కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం వేంపాడులో ఓ ఇంట్లో దొంగలు పడ్డారు. సుమారు 5 కాసుల బంగారం, 3 లక్షల రూపాయల సొమ్మును దొంగిలించారు. నెరుసు వెంకటేశ్వరరావు ఇంటికి తాళం చేసి పొలం పనులకు వెళ్లారు. తిరిగొచ్చి చూసేసరికి తాళం బద్దలు కొట్టి... ఇళ్లంతా చిందరవందరగా ఉండడంతో.. అనుమానం వచ్చి బీరువా తెరిచి చూశారు. నగదు అపహరణకు గురైనట్లు తెలుసుకుని ఉంగుటూరు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని పోలిసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి..అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట
ఆ నలుగురే కాపాడారు'