విజయవాడ గ్రామీణ శివారులోని కుందావారి కండ్రికలో భారీ చోరీ జరిగింది. స్థానికంగా నివాసముండే పునం సామ్రాజ్యం అనే మహిళ ఇంట్లో భారీగా నగదు, ఆభరణాలు మాయమయ్యాయి. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసిన దొంగలు.. తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు.
రూ. 9 లక్షలు, కేజీ వెండి, బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆధారాలు దొరక్కుండా నిందితులు కారం చల్లినట్టు... ఘటనా స్ధలాన్ని పరిశీలించిన విజయవాడ గ్రామీణా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రెండు క్లూస్ టీం బృందాలతో గాలిస్తున్నారు.
ఇదీ చూడండి: