చల్లపల్లిలో టిప్పర్ బీభత్సం... తప్పిన ప్రమాదం
చల్లపల్లిలో టిప్పర్ బీభత్సం... తప్పిన ప్రమాదం - కృష్ణా జిల్లా వార్తలు
కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం రామానగరం పెట్రోల్ బంకు వద్ద త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఉదయం పాఠశాలకు వెళుతున్న విద్యార్థుల వైపు అతి వేగంతో టిప్పర్ దూసుకెళ్లింది. టైరు పంక్చర్ అయిన కారణంగా.. వాహన వేగాన్ని డ్రైవర్ అదుపు చేయలేకపోయాడు. టిప్పర్ రాకను గమనించిన బాలురు.... సైకిళ్లపై నుంచి పక్కకు దూకేశారు. స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనపై చల్లపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

The tipper leaned toward the students in challapalli
చల్లపల్లిలో టిప్పర్ బీభత్సం... తప్పిన ప్రమాదం