ETV Bharat / state

తెలంగాణ వార్షిక బడ్జెట్​పై కసరత్తు.. రెండు లక్షల కోట్లు దాటే అవకాశం..! - తెలంగాణ తాజా వార్తలు

తెలంగాణ బడ్జెట్ రెండు లక్షల కోట్ల మార్కును చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా తదనంతర పరిణామాల్లో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుని రాబడులు పెరిగాయని... బడ్జెట్ కేటాయింపులు ఎక్కువగానే ఉంటాయని ప్రభుత్వం అంటోంది. ప్రస్తుత బడ్జెట్​కు పదిశాతం కేటాయింపులు పెరిగినా.. 2021-22 బడ్జెట్ రెండు లక్షల కోట్ల రూపాయల వరకు వెళ్లే అవకాశం ఉంది.

telangana budget
తెలంగాణ వార్షిక బడ్జెట్ కసరత్తు
author img

By

Published : Mar 7, 2021, 10:31 AM IST

తెలంగాణ వార్షిక బడ్జెట్ కసరత్తు వేగవంతమైంది. సీఎం కేసీఆర్​ బడ్జెట్‌ ప్రతిపాదనలు, కేటాయింపులపై మార్గనిర్దేశం చేశారు. శాఖల వారీగా కేటాయింపులు, ఆర్థిక నివేదికల వివరాలను పరిశీలించారు. కరోనా కష్టాల నుంచి కోలుకుని ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న తరుణంలో... వచ్చే బడ్జెట్‌కు కేటాయింపులు అధికంగానే ఉంటాయని కేసీఆర్​ తెలిపారు.

మహమ్మారి ప్రభావంతో

2020-21 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం లక్షా 82, 914 కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అందులో రెవెన్యూ వ్యయం లక్షా 38, 669 కోట్లు కాగా... మూలధన వ్యయం 22, 061 కోట్ల రూపాయలు. ఐతే బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగానే కరోనా మహమ్మారి ప్రభావంతో.. ఆ అంచనాలను అందుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఆర్థిక కార్యకలాపాలు స్తంభించి సర్కార్ ఖజానాకు ఆదాయం పూర్తిగా పడిపోయింది. ఆదాయం లేక అప్పులు ఎక్కువగా తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత సడలింపులతో రాబడులు క్రమంగా పెరుగుతూ వచ్చాయి.

అంచనాల బడ్జెట్

కాగ్ వివరాల ప్రకారం జనవరి నెలలో రాష్ట్ర ఖజానాకు గరిష్ఠ ఆదాయం వచ్చింది. జనవరి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా వచ్చిన నిధులు లక్షా 18 వేల కోట్ల రూపాయలు. అందులో లక్షా పది వేల కోట్ల రూపాయల వ్యయం చేసింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో మరో 20వేల కోట్లకు పైగా ఆదాయ, వ్యయాలు ఉంటాయని భావిస్తున్నారు. నికరంగా ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలను లక్షా 40 నుంచి లక్షా 50 వేల కోట్ల వరకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.

రెండు లక్షల కోట్ల మార్కు

2021-22లో రాష్ట్ర ఆర్థికవృద్ధి బాగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా బడ్జెట్ పరిమాణం కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలపై 10 శాతం మేర పెరుగుదల ఉన్నా బడ్జెట్ రెండు లక్షల కోట్ల మార్కును దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయా శాఖల వారీగా ఆర్థిక శాఖా మంత్రి హరీశ్​ రావు కసరత్తు చేసిన అనంతరం... బడ్జెట్ ప్రతిపాదనలు, అంచనాలపై ముఖ్యమంత్రి కేసీఆర్​ నిర్ణయం తీసుకోనున్నారు.

ఇదీ చూడండి : తెలంగాణ ఉద్యమంలో ఆస్తులన్నీ కోల్పోయా: జిట్టా బాలకృష్ణారెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.