ETV Bharat / state

రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల ఈవోలు బదిలీ - kanipakam

రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ దేవాలయాల కార్యనిర్వహణ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్నవరం, ఇంద్రకీలాద్రి, కాణిపాకం దేవస్థానాలకు కొత్త ఈవోలను నియమించింది.

దేవాలయాలు
author img

By

Published : Aug 21, 2019, 10:25 PM IST

రాష్ట్రంలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతోంది. ఇన్నాళ్లు భారీగా ఐఏఎస్​, ఐపీఎస్​లకు స్థానచలనం కల్పించిన వైకాపా ప్రభుత్వం... ఇప్పుడు ఆలయ ఈవోలపై దృష్టిపెట్టింది. విజయవాడ దుర్గగుడి, అన్నవరం దేవస్థానం, కాణిపాకం ఆలయానికి కొత్త ఈవోలను నియమించింది. విజయవాడ దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మను సాధారణ పరిపాలన శాఖకు బదిలీ చేసింది. ఆ స్థానంలో ఎం.వి.సురేశ్​బాబు నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం అన్నవరం దేవాలయం ఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

అన్నవరం దేవస్థానం నూతన ఈవోగా త్రినాథరావును ప్రభుత్వం నియమించింది. అలాగే కాణిపాకం దేవస్థానం ఈవోగా పనిచేస్తున్న పూర్ణచంద్రరావుకు స్థానచలనం కల్పించి.. తిరుపతి దేవదాయశాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్‌గా నియమించింది. ఆయన స్థానంలో కాణిపాకం ఈవోగా వి.దేవుళ్లును ఎంపిక చేసింది. వీటితో విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ ఈవోగా డి.భ్రమరాంబ నియమితులయ్యారు.

ఇటీవలే శ్రీశైలంలో షాపింగ్ కాంప్లెక్సుల వేలం వివాదానికి సంబంధించి ఆలయ ఈవో రామచంద్రమూర్తిని బదిలీ చేసింది. ఆయన స్థానంలో రంపచోడవరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేఎస్ రామారావును నియమించింది. ఇది జరిగి రెండు రోజులు కాకముందే మిగతా ఆలయాల్లోని ఈవోలను బదిలీ చేయడం గమనార్హం.

ఇదీ చదవండి

శ్రీశైలంలో 'వేలం' వివాదం... ఆలయ ఈవోపై బదిలీ వేటు

Intro:Ap_knl_142_21_nindithudu_arrest_av_Ap10059
కర్నూలు జిల్లా గడివేముల మండలం గని గ్రామం లో జరిగిన వెంకటకృష్ణ హత్య కేసులో నిందితుడు అరెస్ట్
note: విజువల్స్ వాట్సాప్లో పంపించాను

Body:కర్నూలు జిల్లా గడివేముల మండలం lk తండా గ్రామం లో జరిగిన వెంకటకృష్ణ హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు నంద్యాల డి.ఎస్.పి చిదానంద రెడ్డి అన్నారు.. బుధవారం గడివేముల పోలీస్స్టేషన్లో హత్య వివరాలను వివరించారు. ఈనెల 16వ తేదీ ఎల్కే తాండ గ్రామంలో ఆవులకు కాపలా ఉన్న వెంకటకృష్ణ హత్యకు గురయ్యాడన్నారు. పాణ్యం మండలం పిన్న పురం గ్రామానికి చెందిన వెంకటకృష్ణ ఎల్కే తండాలోని శంకర్ నాయక్ దగ్గర ఆవులకు కాపలా కాయడానికి జీతం చేస్తున్నారన్నారు . శంకర్ నాయక్ పెద్ద కోడలు తో చిన్న కుమారుడు మహేంద్ర నాయక్ రెండు సంవత్సరాలుగా అక్రమ సంబంధం కొనసాగిస్తుండగా 8 నెలల నుంచి వెంకటకృష్ణ తో అక్రమ సంబంధం పెట్టుకుందన్నారు. వదిన దూరం అవుతుందన్న ఆవేశంతో వెంకటకృష్ణ పై కక్ష పెంచుకుని మహేంద్ర నాయక్ హత్య చేసినట్లు ఒప్పుకున్నారు కార్యక్రమంలో పాణ్యం సిఐ నాగరాజు గడివేముల ఎస్సై చిరంజీవి పాల్గొన్నారు

Conclusion:నవీన్ కుమార్ పాణ్యం ఈ టీవీ రిపోర్టర్ కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.