కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండరాదని శివరామకష్ణన్ కమిటీ పేర్కొందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. పాలనను వికేంద్రికరించాలని కమిటీ సూచించిందని తెలిపింది. పాలనను వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. నిధులను పారదర్శకంగా వినియోగించాలన్న ఉద్దేశంతో ప్రజాప్రయోజనం దృష్ట్యా రాజధాని ప్రాంత పనులను నిలిపివేసినట్లు పేర్కొంది. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి(వీజీటీఏం) పరిధిలోని భూములు..ఒక శాతం దేశ ఆహార అవసరాలను తీరుస్తున్నట్లు శివరామకృష్ణన్ కమిటీ పేర్కొంది. ఈ నేపథ్యంలో అక్కడ రాజధాని సరికాదని తెలిపింది. రాజధాని కోసం భూసమీకరణ ద్వారా ప్రైవేటు భూములను సేకరించడంపై కమిటీ హెచ్చరిస్తూ చేసిన సిఫార్సులను అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఉపకమిటీని ఏర్పాటుచేసి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంది. రాజధాని ప్రాంత చుట్టుపక్కల బినామీ లావాదేవీలు, ఇన్సైడర్ ట్రేడింగ్ తదితర విషయాల్లో సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాశామని..సీఐడీ నమోదు చేసిన కేసులను సీబీఐకి నివేదించామని కౌంటర్లో పేర్కొంది.
ఇదీ చూడండి. మహమ్మారి మద్యం.. చేస్తోంది బతుకులు ఛిద్రం..!