ETV Bharat / state

sports authority: విద్యార్థులు క్రీడల వైపు మళ్లేలా క్రీడా ప్రాధికార సంస్థ ప్రణాళికలు - Sports Authority plans latest news

sports authority news: జాతీయ, అంతర్జాతీయ ఆటగాళ్లను తయారుచేసేందుకు.. విద్యార్థులను శిక్షణవైపు మళ్లించేలా కృష్ణా జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ప్రణాళికలు వేసింది. కొవిడ్ పరిణామాలతో విద్యార్థులు క్రీడా ప్రాంగణాలకు రాకపోవటంతో..ృ వారికి క్రీడలపై మళ్లీ ఆసక్తి కలిగించేలా చర్యలు చేపట్టింది. జిల్లాలో 14మంది కోచ్‌లు కళాశాలలు, పాఠశాలలకు వెళ్లి.. క్రీడల వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ విద్యార్ధులకు అవగాహన కల్పిస్తున్నారు

The Sports Authority plans for students to play sports
విద్యార్థులు క్రీడల వైపు మళ్లేలా క్రీడా ప్రాధికార సంస్థ ప్రణాళికలు
author img

By

Published : Dec 1, 2021, 6:37 PM IST

విద్యార్థులు క్రీడల వైపు మళ్లేలా క్రీడా ప్రాధికార సంస్థ ప్రణాళికలు
sports news: కొవిడ్‌ కాలంలో ఇళ్లకే పరిమితమైన చిన్నారులు.. విద్యాసంస్థలు తెరుచుకున్నాక చదువులకే పరిమితమయ్యారు. క్రీడా ప్రాంగణాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. వీరికి క్రీడలపై మళ్లీ ఆసక్తి కలిగించేందుకు కృష్ణా జిల్లా క్రీడాప్రాధికార సంస్థ చర్యలు చేపట్టింది. జిల్లాలోని కోచ్‌లకు ఈ బాధ్యత అప్పగించింది. కోచ్‌లు తమ పరిధిలోని కళాశాలలు, పాఠశాలలకు వెళ్లి విద్యార్థులను క్రీడల వైపు ఆకర్షించేలా చేస్తున్నారు.

Sports Authority plans: క్రీడల్లో రాణించే వారికి మంచి అవకాశాలు

జిల్లాలోని 14 క్రీడా వికాస కేంద్రాల్లో విద్యార్థులు తర్ఫీదు పొందేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని హెడ్‌కోచ్‌ శ్రీనివాసరావు చెబుతున్నారు. క్రీడల్లో రాణించే వారికి చదువుల్లోనూ, ఉద్యోగాల్లో కోటా ఉంటుందని వివరిస్తున్నారు. క్రీడల వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందని.. దీని వల్ల విద్యార్థులు చురుగ్గా ఉండి.. తమకు నచ్చిన అంశంలో మరింత ఎదగగలరని చెప్పారు. క్రీడల నిర్వహణ, ఇతర అవసరాలకు అవసరమైన నిధుల కొరత ఉందని.. ప్రభుత్వ సమన్వయంతో ముందుకెళ్తామని చెప్పారు.

నామమాత్రపు రుసుము వసూలు

క్రీడాశాఖకు తగినన్ని నిధులు లేనందున.. నామమాత్రపు రుసుములు వసూలు చేసి.. ఆటగాళ్లకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దాన్ని వినియోగిస్తామని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: ఈ చిన్నారి జ్ఞాపక శక్తి చూస్తే 'వావ్'​ అనాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.