ETV Bharat / state

PORT: ఓడరేవు ఎన్నికల హామీగానే మిగిలిపోనుందా?

ప్రజా ఉద్యమం ద్వారా సాధించుకున్న బందరు ఓడరేవు ప్రజాప్రతినిధుల ప్రకటనలు, ప్రభుత్వ ప్రణాళికల్లోనే మిగిలిపోతోంది. పనుల కార్యాచరణ విషయంలో ఎదురుచూపులతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు మారుతున్నా నేటికీ ఆశించిన పురోగతి లేకపోవడంతో ఇక ఎప్పటికీ ఓడరేవు ఎన్నికల హామీగానే మిగిలిపోనుందా? అనే అనుమానాలు కృష్ణా జిల్లా వాసుల్లో వ్యక్తమవుతున్నాయి.

The port
The port
author img

By

Published : Aug 31, 2021, 9:25 AM IST

స్వాతంత్య్రానికి పూర్వమే విదేశీ వాణిజ్యంలో ఎంతో పేరుప్రఖ్యాతులున్న బందరు ఓడరేవు కనుమరుగైన ప్రభావం కృష్ణా జిల్లాతో పాటు మచిలీపట్నంపై పడింది. సముద్రతీర ప్రాంతంగా ఉన్న ప్రాచీన పురపాలక సంఘమైన మచిలీపట్నం అభివృద్ధికి దూరమైంది. దేశం మొత్తం మీద జనాభా తరుగుదల ఉన్న ఏకైక పురపాలక సంఘంగా బందరును కేంద్రం గుర్తించిన విషయం తెలిసిందే. వ్యవసాయ ప్రధానమైన జిల్లాలో పారిశ్రామిక పురోభివృద్ధి లేకపోవడంతో ఉపాధి అవకాశాలు అంతంత మాత్రమే అయిన పరిస్థితుల్లో ఓడరేవు ద్వారానే అభివృద్ధి, ఉపాధి అవకాశాలన్న విషయాన్ని గుర్తించారు. ఉద్యమం ద్వారా ఓడరేవును సాధించుకున్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 2008లో ఓడరేవు పనులకు శంకుస్థాపన చేసి ప్రజల చిరకాల వాంఛను సాకారం చేస్తున్నట్టు ప్రకటించారు. పనులు తక్షణం ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోకుండా జీవోలు, ప్రకటనల ద్వారా చేసిన శంకుస్థాపన కార్యక్రమం ఆరంభ శూరత్వానికే పరిమితం అన్నట్టుగా మారింది. అప్పటి నుంచి ఓడరేవును వెన్నాడుతున్న బాలారిష్టాలు ఇప్పటికే కొనసాగుతూనే ఉన్నాయి.

భ్రమలతోనే కరిగిపోతున్న కాలం..

రాష్ట్ర విభజన అనంతరం అధికారం చేపట్టిన తెదేపా ప్రభుత్వం బందరు, పరిసరప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ప్రతిపత్తితో కూడిన మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థ(ముడ)ను ఏర్పాటు చేయడంతో పాటు ఓడరేవు నిర్మాణ పర్యవేక్షణ బాధ్యత అప్పగించింది. ఓడరేవుతో పాటు అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు దాదాపు 30వేల ఎకరాల భూములు సమీకరించేందుకు ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌ వివాదాస్పదంగా మారడంతో నాలుగేళ్ల కాలం వృథా అయ్యింది. ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలో అనుబంధ పరిశ్రమల అంశాన్ని పక్కనపెట్టి కేవలం ఓడరేవుకు అవసరమైన భూములను సమకూర్చుకోవడం, సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను సిద్ధం చేసుకోవడంతో గడచిన సార్వత్రిక ఎన్నికల ముందు గుత్తేదారు సంస్థ పనులు ప్రారంబింఫచేలా చర్యలు చేపట్టడంతో కాస్త ఆశలు చిగురించాయి.

ఎన్నికల తర్వాత అధికారం చేపట్టిన వైకాపా ప్రభుత్వం సకాలంలో పనులు పూర్తిచేయలేదన్న కారణంగా గుత్తేదారు ఒప్పందాన్ని రద్ధు చేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. అధికారం చేపట్టిన వెంటనే పనులు ప్రారంభిస్తామంటూ ఇచ్చిన హామీకి అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ భూముల్లోనే ప్రభుత్వ ఆధ్వర్యాన ఓడరేవు నిర్మిస్తున్నట్టు ప్రకటించడం, పర్యవేక్షణ కోసం ఏపీ మారిటైంబోర్డును ఏర్పాటు చేయడంతో పాటు నిధుల సమీకరణ అధికారాన్ని బోర్డుకు కట్టబెట్టారు. నిర్మాణానికి అవసరమైన భూములు, డీపీఆర్‌ సిద్ధంగా ఉన్నా తదనంతర పురోగతిలో గడచిన రెండున్నర సంవత్సరాలుగా ఆశావహ అడుగులు పడలేదు.

టెండరు ప్రక్రియ కొలిక్కివస్తేనే...

ఓడరేవు నిర్మాణం విషయంలో ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉన్నా ఆచరణ విషయంలో అలవికాని ఆలస్యం చోటుచేసుకుంటోంది. కేంద్ర సంస్థ రైల్‌ ఇండియా టెక్నికల్‌ ఎకనామిక్‌ సర్వీసెస్‌(రైట్స్‌) ఇచ్చిన డీపీఆర్‌తో పాటు రమారమి రూ.5,834 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వ ఆమోదం లభించింది. ప్రతి మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాలు చర్చకు వస్తున్నా టెండరు ప్రక్రియ మాత్రం పూర్తి కావడం లేదు. గడచిన జూన్‌లో టెండర్లు పిలిచినా సాంకేతిక, ఆర్థిక అంశాలకు సంబంధించిన నిబంధనల కారణంగా గుత్తేదారులు ముందుకురాలేదు. సవరించిన నిబంధనలతో మారిటైంబోర్టు తాజాగా టెండరు పిలిచి ఈనెల 24 తుదిగడువుగా ప్రకటించింది. ఎవరూ ఆసక్తి చూపకపోవడం గడువు తేదీని మరికొద్ది రోజులపాటు పొడిగించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఓడరేవు నిర్మాణానికి అవసరమైన నిధులను మారిటైంబోర్డుకు అప్పుగా ఇచ్చేందుకు బ్యాంకులు, గుత్తేదారులు ఏమేరకు ముందుకు వస్తారన్నది ప్రశ్నార్థకం అవుతోంది.

ఇదీ చదవండి: సర్దుబాటు షాక్...ప్రజలపై రూ.3.669కోట్ల విద్యుత్ భారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.