కృష్ణా జిల్లా అవనిగడ్డ శివారు కృష్ణానది పక్కన ఉన్న పాతఎడ్లలంక గ్రామంలో సుమారు 1500 ఎకరాల్లో మామిడి పండించారు. కానీ ఈ పంట కొనేవారు లేక రైతులు దిగాలు చెందుతున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో 3 రోజులు పూర్తిగా కర్ఫ్యూ విధించడం, మరో మూడు రోజులు 12 గంటల వరకే షాపులకు అనుమతి ఇవ్వడంతో కొనేందుకు ఎవరూ రావడంలేదని రైతులు చెబుతున్నారు. ఇక్కడి లంక తోటల్లో కాసిన మామిడికాయలు చాలా రుచిగా ఉంటాయని పేరుంది. విదేశాలకు ఎగుమతి చేసేవారు. కరోనా కారణంగా... హోల్సేల్ వ్యాపారులు కూడా ఇటువైపు రావడం లేదు.
మరోవైపు వాతావరణ ఇక్కడి రైతులపై పగబట్టినట్టు ఉంటోంది. అకాల వర్షాలు కురిసి పంట నేల రాలుతోంది. ఎకరాకు 20 రూపాయల పెట్టుబడి పెట్టామని, దాంట్లో 10 శాతం కూడా ఇప్పటివరకు రాలేదని అన్నదాతలు చెబుతున్నారు. పండ్లను ఈగల నుంచి కాపాడుకోవడానికి రాయితీపై ఇచ్చే కవర్లు కూడా ఇవ్వలేదని రైతులు చెబుతున్నారు. అటు వ్యాపారం లేక... ఇటు ప్రభుత్వం సహకరించక అవస్థలు పడుతున్నామని అంటున్నారు. తమ ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించి.. మామిడికాయలు అమ్మడానికి వీలు కల్పించాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండీ... రాష్ట్రంలో కొవిడ్ పాజిటివిటీ రేటు తగ్గింది: ఏకే సింఘాల్