ETV Bharat / state

ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణల కోలాహలం - Bejawada Kanakadurgamma Inmates at vijayawada eo suresh babu

విజయవాడ ఇంద్రకీలాద్రి పరిసరాలు భవానీ నామస్మరణతో మారుమోగుతున్నాయి. భవానీ దీక్షా విరమణోత్సవాల కోసం తరలివచ్చిన భక్తులతో దుర్గమ్మ సన్నిధి అరుణ వర్ణంతో మెరిసిపోతోంది. అంతరాలయం నుంచి తీసుకువచ్చిన అగ్నిహోత్రంతో హోమగుండాలు వెలిగించటం ద్వారా ఈ ఉత్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టారు.

the devotees Bejawada Kanakadurgamma Inmates at vijayawada
భవానీ దీక్ష విరమణోత్సవాలు
author img

By

Published : Dec 18, 2019, 11:55 PM IST

భక్తుల పాలిట కొంగుబంగారం బెజవాడ కనకదుర్గమ్మ. అలాంటి అమ్మవారి సేవలో తరించేందుకు భక్తులు భవానీ దీక్ష ధరించి అమ్మలగన్నయమ్మను భక్తితో కొలిచారు. దీక్షను ముగించిన భక్తులంతా ఇప్పుడు విరమణ కోసం ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారు. అమ్మ సన్నిధిలో ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో దీక్షను విరమిస్తారు. దుర్గమ్మ అంతరాలయం నుంచి తీసుకువచ్చిన అగ్నిహోత్రంతో హోమగుండాలను వెలిగించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఈవో సురేష్ బాబు, స్థానాచార్యులు, ప్రధాన అర్చకులు ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించారు.

భవానీ దీక్ష విరమణోత్సవాలు

భవానీ దీక్షా విరమణోత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు తరలివస్తారు. రైలు, బస్సు మార్గాలతో పాటు చాలామంది కాలినడకన కూడా అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. మొక్కులు తీర్చుకునే భవానీలు ఇంద్రకీలాద్రి చుట్టూ గిరిప్రదక్షిణలో పాల్గొని... అనంతరం అమ్మవారిని దర్శించుకుంటారు. ఇరుముడి కుండీల వద్ద గురుభవానీల ఆధ్వర్యంలో దీక్షను విరమిస్తున్నారు.

క్యూలైన్ల నుంచి దర్శనం వరకు అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేయడంపై భవానీ దీక్షాధారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పద్ధతి ప్రకారం అధికారులు, పోలీసులు సమన్వయంతో ఏర్పాట్లు చేశారని భక్తులు చెబుతున్నారు. దీక్ష విరమణల తొలి రోజు అయినప్పటికీ ఉదయం మినహా....మరే సమయంలోనూ రద్దీ పెద్దగా కనిపించలేదు. ఈ అంశంపై దీక్షాధారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి...

దుర్గమ్మ సన్నిధిలో 'టెన్సైల్ ఫ్యాబ్రిక్ షెడ్'

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.