నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లి పైనే దాడి చేశాడో ప్రబుద్ధుడు. కృష్ణాజిల్లా నందిగామ మండలం గోళ్ళమూడి గ్రామానికి చెందిన మరియమ్మ కుమారుడు పనీపాట లేకుండా జులాయిగా తిరుగుతున్నాడు. ఇటీవల కాలంలో మరియమ్మ భర్త చనిపోవడంతో చంద్రన్న బీమా కింద ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఆ డబ్బులపై కన్నేసిన మరియమ్మ కుమారుడు తన స్నేహితులతో కలసి మద్యం తాగేందుకు డబ్బులు కావాలని కోరగా, ఆమె నిరాకరించింది. దీంతో మరియమ్మపై ఆగ్రహంతో కర్రతో దాడి చేశాడు. మరియమ్మకు తలపై తీవ్రగాయాలు కావడంతో గ్రామస్తులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి:గోదావరిలో నిలకడగా వరద ప్రవాహం