2017-18 విద్యా సంవత్సరానికి నిర్ణయించిన ఫీజుల గడువు గత ఏడాదితో ముగియగా... ఈ ఏడాది కొత్తగా ఫీజులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరో వైపు జీవో 43 పై ప్రభుత్వం మార్గనిర్దేశకాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేయాల్సి ఉంది. రెండు రోజుల్లో జీవో విడుదలపై స్పష్టత రానుందని... అదే రోజున ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ వెల్లడిస్తామని విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ వెల్లడించారు.
ఆల్ ఇండియా ప్రవేశాలకు సంబంధించి కళాశాలల్లో చేరికకు... ఈనెల 28లోగా గడువు ఉండడంతో ఇప్పటికే కొంతమంది విద్యార్థులు వెళ్లిపోయారు. అలాగే తెలంగాణాలో మొదటి విడత వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ ముగియగా.. అక్కడ సీట్లు పొందిన అభ్యర్థులు ఆయా కళాశాలల్లో ప్రవేశాలకు అంగీకారం తెలిపారు. దీంతో ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాల్లో సీట్లు పొందే అభ్యర్థులు కౌన్సెలింగ్ కోసం వేచి చూస్తున్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియలో కీలకమైన సీట్ మ్యాట్రిక్స్‌ను విడుదల చేసేందుకు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ సన్నద్ధమైంది. భారతీయ వైద్య మండలి నిబంధనల మేరకు రాష్ట్రంలో పీజీ మెడికల్, డెంటల్ ప్రవేశాలను మే 31లోగా ముగించాల్సి ఉంది. కరోనా ఉన్నందున.. ఈ గడువును జూన్ 30 వరకు పొడిగించాలని అన్ని రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు కోరాయి. దీనిపై ఎంసీఐ ఇంకా ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు. కరోనా వైద్య సేవలందిస్తున్నందున ప్రస్తుతం పీజీ చేస్తున్న విద్యార్థులకు రెండు నెలల ఉపకార వేతనాలు అందించాలని.. వారిని రెసిడెంట్ డాక్టర్లుగా చూడాలని ఎంసీఐ తాజాగా మార్గనిర్దేశకాలను జారీ చేసినట్టు తెలిసింది.
ఇదీచూడండి. పొరుగు సేవల ఉద్యోగుల జీతాలు చెల్లించండి: ఆర్టీసీ ఎండీ