ETV Bharat / state

దశల వారీ ఆందోళనకు వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు.. ఏప్రిల్ రెండోవారం నుంచి ఆందోళన బాట

Employees of Commercial Tax Department : సంస్కరణల పేరుతో వాణిజ్యపన్నులశాఖలో అధికారాల కేంద్రీకరణ జరుగుతోందని వాణిజ్యపన్నులశాఖ సర్వీసెస్‌ అసోయేషన్‌ నేతలు ఆరోపిస్తున్నారు. హేతుబద్ధత లేని నిర్ణయాల వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని... ఈ చర్యలపై ఏప్రిల్‌ రెండో వారం నుంచి దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Mar 5, 2023, 8:16 PM IST

Employees of Commercial Tax Department : వాణిజ్యపన్నులశాఖ ఉద్యోగులు ఏప్రిల్‌ రెండో వారం నుంచి దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. సంస్కరణల పేరుతో వాణిజ్యపన్నులశాఖలో అధికారాల కేంద్రీకరణ జరుగుతోందని వాణిజ్యపన్నులశాఖ సర్వీసెస్‌ అసోయేషన్‌ నేతలు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయిలోని సర్కిల్‌ కార్యాలయాల అధికారాలను తొలగించి, నిర్వీర్యం చేయడం ద్వారా శాఖను బలహీనపరుస్తున్నారని అన్నారు. హేతుబద్ధత లేని నిర్ణయాల వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని... ఈ చర్యలపై దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు అసోయేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి జీఎం రమేష్‌కుమార్‌ ప్రకటించారు. విజయవాడ మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో వాణిజ్యపన్నులశాఖ సర్వీసెస్‌ అసోయేషన్‌ రాష్ట్ర సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

వాణిజ్యపన్నులశాఖలోని 750కిపైగా ఉన్న ఏసీటీఓలకు ఎలాంటి అధికారాలు లేకుండా చేయడం వల్ల క్షేత్రస్థాయిలో జీఎస్‌టీ చట్టం అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని... ఈ అధికారుల సేవలను గరిష్టస్థాయిలో ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ సమావేశంలో తీర్మానించారు. వాణిజ్యపన్నులశాఖ ప్రధాన కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులపై ఉన్న అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయాలని... అంతవరకు వారిని ఆ బాధ్యతల నుంచి తప్పించాలని కోరారు.

వేధింపులు తగదు.. క్రమశిక్షణ చర్యల పేరుతో కిందస్థాయి ఉద్యోగులను అకారణంగా వేధిస్తున్నారని అన్నారు. వాణిజ్య పన్నుల శాఖ 16 డివిజన్లలోని ప్రతినిధులు అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించి 12 తీర్మానాలను ఏకగీవ్రంగా ఆమోదించారు. వాణిజ్యపన్నులశాఖ పునర్‌ వ్యవస్థీకరణ ఎలాంటి సానుకూల ఫలితాలు ఇవ్వకపోగా... సర్కిల్‌ కార్యాలయ వ్యవస్థను మరింత బలహీనపరిచిందని అభిప్రాయపడ్డారు. జూలై 2022లో జరిగిన ఉద్యోగుల బదిలీలలో అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయని... వాటిని సరిదిద్ది న్యాయం చేయాలని కోరారు.

క్రమశిక్షణ చర్యలు చేపట్టాలి.. ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘించిన జాయింట్‌ కమిషనర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికిపైగా ఉద్యోగులకు మెమోలు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. క్రమశిక్షణ చర్యల విషయంలో ఉద్యోగులకు, ఉన్నతాధికారులకు ఒకేరకమైన విధానాలు అవలంబించాలని... వాణిజ్య పన్నులశాఖలోని కొన్ని అక్రమాల ఆరోపణలపై లోకాయుక్తతో గాని, విజిలెన్స్‌ శాఖతోగాని లేదా అనిశాతో గాని ప్రభుత్వం నిష్పాక్షిక దర్యాప్తు చేయించాలని కోరారు.

పదోన్నతులు కొనసాగించాలి... అన్ని క్యాడర్లలోనూ సీనియారిటీ జాబితాలను వెంటనే పూర్తి చేసి ఖాళీలను పదోన్నతి ద్వారా వెంటనే భర్తీ చేయాలని... జీఎస్టీఓలకు గెజిటెడ్‌ హోదా కల్పిస్తూ గత ఏడాది ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది కానీ రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించిన షెడ్యులులో జీఎస్‌టీఓలను చేర్చలేదని తెలిపారు. ఈ విషయంలో అవసరమైతే కేంద్ర హోంశాఖ, రాష్ట్రపతిని కలిసి విన్నవించాలని సమావేశం తీర్మానించింది. గత ఏడాది జరిగిన బదిలీలలో రాష్ట్ర పతి ఉత్తర్వులకు భిన్నంగా కొన్ని బదిలీలు జరిగాయని... ఈ ఉల్లంఘనలపై ప్రభుత్వానికి నివేదించినా ఇంతవరకు చర్యలు లేనందున... కేంద్ర హోంశాఖ, రాష్ట్రపతిని కలిసి విన్నవించాలని సమావేశం నిర్ణయించింది.

రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖ పునర్ వ్యవస్థీకరణ రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా జరగడం లేదు. ఉత్తర్వుల ఉల్లంఘనల విషయాన్ని రాష్ట్రపతిని కలిసి వివరిస్తాం. ఉద్యోగుల సమస్యలపై గవర్నర్ ను కలిశామనే కారణంతో రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. సంఘం గుర్తింపు రద్దు చేయాలని కొన్ని తాబేదార్ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. వాణిజ్యపన్నులశాఖ సర్వీసెస్‌ అసోసియేషన్ ను నిర్వీర పరచాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఉద్యోగుల ను సస్పెండ్ చేయడం ద్వారా భయపెట్టేందుకు ప్రయత్నించింది. - సూర్యనారాయణ, రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.