ETV Bharat / state

ఎలక్షన్ డ్యూటీకి.. వాలంటీర్లను దూరంగా ఉంచాలి: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి - Volunteers away from Election duties

Chief Electoral Officer: గ్రామ, వార్డు వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మరోసారి ఆదేశాలిచ్చారు. ఎన్నికలకు సంబధించిన ఏ ప్రక్రియలోనూ వారికి విధులు అప్పగించొద్దని కలెక్టర్‌లు, రిటర్నింగ్ అధికారులకు సూచించారు.

ceo
ceo
author img

By

Published : Sep 16, 2022, 6:36 PM IST

Volunteers away from Election duties: గ్రామ, వార్డు వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని.. జిల్లా కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మరోసారి ఆదేశాలిచ్చారు. ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం చేసే ప్రక్రియలో వాలంటీర్లను భాగస్వామ్యం చేయొద్దని స్పష్టం చేశారు. ఎన్నికలకు సంబధించిన ఏ ప్రక్రియలోనూ వారికి విధులు అప్పగించొద్దని కలెక్టర్‌లకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందుతున్న కారణంగా ఎన్నికల విధుల్లో వారికి అవకాశం ఇవ్వొద్దని. ముఖేష్‌ కుమార్‌ మీనా ఆదేశాలిచ్చారు.

ఇవి చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.