విజయవాడ దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం... దుర్గా ఘాట్ వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో టెన్సైల్ ఫ్యాబ్రిక్ షెడ్ నిర్మిస్తున్నారు. రాష్ట్ర సహకార బ్యాంకు - ఆప్కాబ్ ఆధ్వర్యంలో ఈ నిర్మాణం జరుగనుంది. 40 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టే ఈ నిర్మాణానికి... ఆలయ ఈవో సురేబ్ బాబు, ఆప్కాబ్ జీఎం విజయ భాస్కర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆలయ వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా ఉత్సవాల సమయానికి షెడ్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆలయ ఈఈ భాస్కర్ తెలిపారు.
ఇదీ చూడండి: